కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్రను నిర్వహించిన టీడీపీ శ్రేణులు

  • చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్
  • నల్గొండలో ఆందోళన చేపట్టిన టీడీపీ శ్రేణులు
  • ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమంటూ హెచ్చరిక
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నల్గొండలో ఈరోజు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని అన్నారు. చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్రను నిర్వహించారు.

నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ, ‘ఇవాళ ఇక్కడ (తెలంగాణ) దుకాణం పెడదామనుకుంటున్నావు.. బిడ్డా! నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. తెలంగాణకు మళ్లీ నువ్వు కావాలా?' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
kcr
Chandrababu
TRS
Telugudesam
nalgonda

More Telugu News